Pages

Subscribe:

Ads 468x60px

Monday, 16 December 2013

మెడనొప్పికి హోమియో చికిత్స

ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే సమస్య ఇంకా త్రీవం అవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయం అవుతుంది.

కారణాలు: 
మెడ వెనక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్(మృదులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానిఇక కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే ఈ కార్టిలేజ్ అసంబద్ధ భంగిమలో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వహించటం, ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, ఆహారంలో కాల్షియం, విటమిన్‌లు తగినంత లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఈ కార్టిలేజ్ క్షీణించడం, ఆస్టియోపైట్స్ ఏర్పడటం జరగుతుంది. ఇలా కార్టిలేజ్లఓ వచ్చే మార్పుల వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. దీనినే 'సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

లక్షణాలు:
మెడనొప్పి త్రీవంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి త్రీవం అవుతుంది.
వెన్నుపూస నుండి చేతులకు బయలుదేరు నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి ఒక్కోసారి తల తిప్పినట్టు అనిపిస్తుంది.
చేయి పైకి ఎత్తడం కూడా కష్టంగా ఉంటుంది.

జాగ్రత్తలు: 
  • సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడే వారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తగు విశ్రాంతి తీసుకోవాలి.
  • కుర్చీలో కూర్చొన్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండే విధంగా సరైన భంగిమలో కూర్చోవాలి.
  • బరువులు ఎక్కువగా లేపకూడదు.
  • పడుకొనేటప్పుడు తలకింద ఎత్తైన దిండ్లు వాడకూడదు.
  • మెడను ఒకేసారి, అకస్మాత్తుగా తిప్పకూడదు.
  • మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు చేయాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకు.
  • సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.

హోమియో చికిత్సా విధానం: 
హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కు పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా లక్షణాలకు సరైన కారణలు, రోగికి సంబంధించిన శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని అందిస్తారు అనుభవజ్ఞులైన వైద్యులు. ఇందులో సాధారణంగా వాడే మందులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే...

బ్రయోనియా: 
మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతి వల్ల నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్న వారికి ఈ మందు ఎంతో ప్రయోజనకారి.

స్పైజీలియం: 
నొప్పి మెడ నుంచి మొదలై ఎడమ భుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది. అలాంటి వారికి ఈ మందు ఎంతగానో ఉపకరిస్తుంది.
కాల్మియా: కుడి భుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి.
కోనియం: మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇవేకాకుండా హైపరికం, రాస్‌టాక్స్ మొదలైన మందులను, వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచన మేరకు వాడగలిగితే మెడనొప్పి నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎండీ, హోమియో
స్టార్ హోమియోపతి
ఫోన్: 90300 81876, 90300 81861

0 comments:

Post a Comment