Pages

Subscribe:

Ads 468x60px

Monday, 16 December 2013

అధికంగా బాధించే కీళ్లనొప్పులకు ఆపరేషన్ అవసరమా..?

నేటి ఆధునిక జీవనం కీళ్ల పైన మరింత ఒత్తిడి తీసుకు వస్తోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ల జబ్బులకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు సమస్యలు కూడా కీళ్ల సమస్యలను పెంచుతాయి.
వీటిన్నిటికి తోడు కొన్ని రకాల వ్యాధులు, ప్రమాదాల్లో గాయపడటం వల్ల కీళ్లు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా తీసుకురావచ్చు. కీళ్లను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల బలహీనమై సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంది.

నడవడమే కష్టం
కీళ్లలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు లేదా ఇతర కీళ్ల భాగం విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. వాపు, బిగుతుగా ఉండటం, నడవడానికి ఇబ్బంది వంటివి సమస్యలు బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు దాని రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. కీళ్లలో అరుగుదల, నష్టం ఎక్కువైన తరువాత కీళ్లలో కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కొన్ని రకాల పనులు చేయలేం. కూర్చోని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. టాయిలెట్లు ఉపయోగించడం కూడా పెద్ద సమస్య అవుతుంది.

కీళ్లలో మార్పులు
కీళ్లు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. కీళ్లలో సమస్య ఉన్నప్పుడు ముందుగా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే సమస్యలు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్లు ప్రభావితం అయినా, ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి, ముడతలు పడుతుంది. కీళ్ల భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడుతాయి. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలోని రక్తనాళాలు ఉబ్బటం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోపైట్స్ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి నలభై రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోపైట్స్ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ల లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్లి గడ్డలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకలోని ట్రాబ్‌క్యూల్ అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువవుతుంది.

ఆపరేషన్ లేకుండా హోమియో చికిత్స
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, స్కానింగ్ ద్వారా ఏ కారణాల వల్ల ఏ కీలు దెబ్బతిన్నది, వ్యాధి ఏ రకమైనది అన్న విషయాలను నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాలలో కీళ్ల నొప్పులు ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గాలంటే కీళ్లమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందుల్ని అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో వైద్యం. ఆధునిక హోమియో మందులు ఇన్ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ను బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్త సరఫరా సవ్యంగా జరిగేటట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలి దశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎండీ, హోమియో
స్టార్ హోమియోపతి
ఫోన్: 9030081876, 9030081861

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment