Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 11 August 2013

సుఖవ్యాధులకు ఆయుర్వేద చికిత్స

మన సమాజంలో సుఖవ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ వ్యాధిపీడితుల్లో ఆందోళన పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సుఖవ్యాధులున్న ఇతర వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడం వల్ల వీరికి కూడా సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్ క్లమీడియా వంటి సర్వసాధారణమైన సుఖవ్యాధుల నివారణకు హోమియో మందులు మేలంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్ నరసింహ.

హెర్పిస్ సిప్లెక్స్ వైరస్ వల్ల స్త్రీ, పురుషుల జననాంగాలకు సంబంధించిన జనైటల్ హెర్పిస్ సంక్రమిస్తుంది. స్త్రీ,పురుషుల జననాంగాల పైన ఎర్రటి పొక్కులు వచ్చి చితికి మంటగా, దురదగా, నొప్పిగా ఉంటుంది. వీటితోపాటు జ్వరం వచ్చినట్లు శరీరంలో బడలిక, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. వ్యాధినిరోధకశక్తి తగ్గిన వారిలో హెర్పిస్ ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. గర్బిణీ స్త్రీలకు ఈ వ్యాధి సంక్రమిస్తే పుట్టబోయే శిశువుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.జ ఆయుర్వేద పరంగా హెర్పిస్‌ను విసర్సయిగంగా పేర్కొనబడింది. హెర్పిస్ లక్షణాలు బయటపడడానికి 7 రోజుల నుంచి 10 రోజులు పడుతుంది.

గనేరియా
నైజీరియా గనేరియా వంటి బ్యాక్టీరియా వల్ల గనేరియా సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సంక్రమించిన 5 రోజుల నుంచి 10 రోజుల్లో లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఆయుర్వేద పరంగా గనేరియాను 'పియూమేహం' గా చెప్పారు. మగవారిలో గనేరియా సంక్రమించడం వల్ల మూత్రంలో మంట, దురద, మూత్రనాళం నుంచా తెల్లటి లేక పసుపుపచ్చని చీము లాంటి ద్రవం వస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రోస్టేట్‌గ్రంథిలో వాపు, వృణణాలపైన కూడా దీని ప్రభావం పడడం వల్ల వీర్యకణాల్లో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలకు గనేరియా సంక్రమించడం వల్ల మూత్రం పోస్తున్నపుడు మంట, నొప్పి, వైట్ డిశ్చార్జ్ అవుతుంటాయి. శృంగారంలో పాల్గొన్నపుడు ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. గనేరియా వల్ల పెల్లోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం వల్ల సంతానలేమి సమస్యలకు కారణం అవుతుంది.

సిఫిలిస్
ఇది చాలా ప్రమాదకరమైన సుఖవ్యాధిగా చెప్పవచ్చు. ఇది 'ట్రెపోనమా పల్లాడం' లాంటి బ్యాక్టిరియా వల్ల వస్తుంది.
ఆయుర్వేద పరంగా దీనిని ఫిరంగిరోగంగా పేర్కొన్నారు. ఈ వ్యాధి సంక్రమించిన 10 రోజుల నుంచి 90 రోజుల లోపల వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. సిఫిలీస్ సంక్రమించడం వల్ల జననాంగాలపైన, మలద్వారాల పైన, నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. సిఫిలీస్ వ్యాధి 3 లేక 4 దశలతో సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల శరీరంలో మెదడు, నాడీవ్యవస్థ, గుండె, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది.

క్లమీడియా
సర్వసాధారణంగా సంక్రమించే వ్యాధి ఇది. క్లమీడియా ట్రాకోమోటీస్ లాంటి బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ముఖ్యంగా జననాంగాలకు సంక్రమిస్తుంది. పురుషుల్లో క్లమీడియా సంక్రమించడం వల్ల మూత్రనాళంలో వాపు, మంట, వైట్ డిశ్చార్జ్ రావడం, బీజాల్లో నొప్పి రావడం సంభవిస్తుంది. స్త్రీలలో దీనివల్ల మూత్రంలో నొప్పి మూత్రం పదేపదే వచ్చునట్లు ఉండడం, కడుపు నొప్పి, శృంగారంలో పాల్గొన్నపుడు నొప్పి, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ వంటివి సంభవిస్తాయి.

వ్యాధి నిర్ధారణ
సుఖవ్యాధులతో బాధ పడే వారికి మూత్ర పరీక్ష, హెచ్ఎస్‌వి 1, 2 పరీక్ష , హెచ్ఐవీ 1, 2 పరీక్ష, వీడీఆర్ఎల్ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.

ఆయుర్వేద చికిత్స
సుఖవ్యాధులతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు ఇచ్చే మందులు అందుబాటులో ఉన్నాయి. సుఖవ్యాధులు సంక్రమించిన వెంటనే ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవడం మంచిది. సుఖవ్యాధులతో బాధపడే వారికి సంతానలేమి సమస్యలు, శృంగార సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సుఖవ్యాధులు, శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యలతో బాధపడే వారు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా 4నుంచి 6 నెలల పాటు మందులు వాడినట్లయితే మంచి ఫలితాలు పొందగలరు.

డాక్టర్ ఎం. నరసింహ
ఎండి,(ఆయుర్వేద) సెక్సాలజిస్ట్
సాయిబాలాజీ ఫెర్టిలిటీ క్లినిక్
హైదరాబాద్, విజయవాడ
ఫోన్స్ : 924656 4433
939656 4433

సేకరణ: అంధ్రజ్యోతి, సకల

0 comments:

Post a Comment