ప్రతి మనిషినీ ఏదో ఒక సమయంలో దగ్గు బాధించకుండా ఉండదు. జలుబు చేసో లేక ఉబ్బసం వల్లనో ఏదో ఒక కారణం ఉంటుంది. కాని ఎక్కువ కాలం దగ్గుబాధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టరు దగ్గరకు పోవాల్సిందే.
ఈ దగ్గు బారిన పడేవాళ్లలో తరతమ భేదాలు అంతగా ఉండవు. చిన్నపిల్లలకు, మధ్య వయస్కులకు ముసలి వారిని పురుషులు మహిళలను కూడా దగ్గు వదలదు.
ఇంకా ఆడవారిలో దగ్గు ఉనికి ఎక్కువఅని వైద్యులు అంటారు. చిన్న పిల్లల విషయంలో అయతే వారు చల్లగాలికి తిరిగినప్పుడో, ఐస్ క్రీములు , చాకోలేట్స్ లాంటి చల్లని పదార్థాలు తినడం వల్లనో దగ్గు పట్టుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈ క్రింది కారణాల వల్ల కూడా దగ్గు జబ్బు వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ఆడవారిలో దగ్గు ఉనికి ఎక్కువఅని వైద్యులు అంటారు. చిన్న పిల్లల విషయంలో అయతే వారు చల్లగాలికి తిరిగినప్పుడో, ఐస్ క్రీములు , చాకోలేట్స్ లాంటి చల్లని పదార్థాలు తినడం వల్లనో దగ్గు పట్టుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈ క్రింది కారణాల వల్ల కూడా దగ్గు జబ్బు వచ్చే అవకాశం ఉంది.
- ధూమపానం: దీర్ఘకాలపు దగ్గుకు అతి ప్రధాన కారణం ధూమపానం. సిగరెట్లు తాగేవారిలో కనిపించే నుసిదగ్గు (స్మోకర్స్ కాఫ్) ఎంపైసిమా అనే ప్రమాదకరమైన సరిచేయలేని ఊపిరితిత్తుల వ్యాధికి సూచన. సిగరెట్ పొగకు పరోక్షంగా గురికావటం వల్ల కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, దానిని అనుసరించి దగ్గూ వచ్చే రిస్క్ ఉంటుంది.
- మహిళలై ఉండటం: దగ్గు విషయంలో స్ర్తి, పురుష భేదాన్ని గమనిస్తే మగవారిలో కంటే ఆడవారిలో దగ్గు ఉనికి ఎక్కువ. మహిళల్లో దగ్గును ప్రేరేపించే యంత్రాంగం (కాప్ రిఫ్లక్ట్స్) ఎక్కువ సున్నితంగా ఉండటం దీనికి కారణం.
- ఎలర్జీ ప్రేరణలు (ఎలర్జన్లు): నిరంతరం దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల మలమూత్రాల రేణువులు, ఇంటి శుభ్రతకోసం వాడే రసాయన పదార్థాలు పొగ వంటి ప్రేరణలకు నిరంతరమూ గురయ్యే వారిలో ఎలర్జీలు, ఉబ్బసం వంటివి లేకపోయినప్పటికీ దగ్గు మొండిగా తయారై బాధించవచ్చు.
- కాలుష్యం: వాతావరణం కాలుష్యం (వాహనాల నుంచి వెలువడే డీసెల్ పొగ, ఓజోన్, నైట్రోజన్ డైఆక్సైడ్) పిల్లల్లోనూ, పెద్దల్లోనూ మొండి దగ్గును కలిగించే అవకావం ఉంది.
దగ్గు చిన్నగా వచ్చినా, ఎక్కువ కాలం ఉన్నా, లేకుంటే పొడిదగ్గునో, శే్లషం వచ్చే దగ్గునో ఉంటే అది శ్వాసనాళాల ఇన్‌ఫెక్షన్ వల్ల, ఉబ్బసం రావడానికిసూచనగా నైనా రావచ్చు. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కనుక దగ్గును మాత్రం అసలు నిర్లక్ష్యం చేయద్దు. గృహచికిత్సలు చేసినప్పటికీ వైద్యుల పర్యవేక్షణ అత్యంత అవసరం ఈ దగ్గు నివారణకు. దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే తగిన చికిత్స చేసుకొని దగ్గును దూరం చేసుకోవడం మంచిదని వైద్యులు అంటారు.
మూలం: ఆంధ్రభూమి, సంజీవిని
మూలం: ఆంధ్రభూమి, సంజీవిని







0 comments:
Post a Comment