Pages

Subscribe:

Ads 468x60px

Friday, 21 September 2012

ఆటిజానికి హోమియో వైద్యం

'ఆటిజం' వ్యాధి అని తెలియగానే, చాలా మంది ఆ పిల్లల జీవితం ఇక ఎందుకూ పనికి రాకుండా పోతుందనుకుంటారు. శారీరకంగా, మానసికంగా కుంగదీసే ఈ వ్యాధి తీవ్రమైనదే. కానీ, ఆధునిక హోమియో వైద్య చికిత్సలు ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నాయి. కాకపోతే, వ్యా«ధిని తొలిదశలో గుర్తించినప్పుడే ఈ ప్రయోజనాలు సంపూర్ణంగా ఉంటాయంటున్నారు హోమియోవైద్య నిపుణులు డాక్టర్ టి. కిర ణ్‌కుమార్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

పిల్లల ఎదుగుదల శారీరకంగా, మానసికంగా సరిగా లేకపోతే, ఏ తల్లిదండ్రులైనా భాధపడకుండా ఎలా ఉంటారు? ఆ పిల్లలు మాట్లాడటం, నడవడంలోనూ బాగా ఆలస్యమైపోతుంటే, వారి ఆందోళనకు ఇక అంతే ఉండదు. ఇది ఆటిజం వ్యాధితో ఎదురయ్యే పరిణామాలు. పిల్లలు సరిగా మాట్లాడలేకపోవడం, మాట్లాడే సమయంలో కళ్లలోకి చూడలేకపోవడం, నలుగురితో అనుబంధాలు ఏర్పరచుకోలేకపోవడం,భావోద్వేగాలను వ్యక్తం చేయలేకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.విచిత్రంగా ప్రవర్తిస్తూ, చిత్రమైన చేష్టలు చేస్తుంటే అది "ఆటిజం'' అయ్యే అవకాశం ఎక్కువ. అయితే, వినికిడి సమస్య ఉన్న పిల్లలకు కూడా మాటలు సరిగా రావు. అందువల్ల, ఇతర సమస్యలేమైనా ఉన్నాయేమో చూసుకుని, వైద్యుల సలహాతో, అది ఆటిజమ్ అవునో కాదో నిర్ధారించుకోవాలి.

ఆటిజం ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది పలురకాలుగా ఉంటుంది. అందుకే, కొన్నిసార్లు ఆటిజం ఉన్న పిల్లలకు, ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు మధ్య ఉన్న తేడాను మామూలుగా అయితే గుర్తించడం కష్టమవుతుంది. ఏమైనా మెదడు ఎదుగుదల బాగా కుంటుపడిపోయే ఈ వ్యాధిని నిపుణులైన వైద్యుల ద్వారా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మేలు. ఆటిజం వ్యాధి లక్షణాలు అందరు పిల్లల్లో ఒకేలా ఉండవు. కొందరిలో ఈ వ్యాధి లక్షణాలు చాలా స్పష్టంగానే కనిపిస్తాయి. అలాంటి వాటిని 'క్లాసిక్ ఆటిజం' అంటారు. కొందరిలో ఈ లక్షణాలు అంత తీవ్రంగా ఏమీ ఉండకపోగా, వారి జీవనశైలి మీద ఏ ప్రభావాన్నీ చూపవు. ఇలాంటి వాటిని 'మైల్డ్ ఆటిజం' లేదా 'యాస్పర్జర్ సిండ్రోమ్' వంటి పేర్లతో పిలుస్తారు.

ఎలా తెలుస్తుంది?
పిల్లల్లో కనిపించే ఈ వ్యా«ధి లక్షణాల్లో ప్రధానంగా భావ వ్యక్తీకరణ, ఏకాగ్రతా పరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో దాదాపు 40 శాతం మందికి అసలు మాటలే రాకపోవచ్చు. తోటి పిల్లలతో స్నేహం చేయకోలేకపోవడం, ఎదుటి వారి భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోవడం, ఎవరితోనూ తమ భావోద్వేగాలను పంచుకోలేకపోవడం, వయసుకు తగ్గ పరిణతి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఒకేమాటను పదేపదే ఉచ్చరించడం, లేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడగడం కనిపిస్తుంది. ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం, ఒకేరకమైన ఆహరం లేదా దుస్తులు కావాలనడం, చేతులు, కాళ్లు విచిత్రంగా కదపడం, చుట్టూ తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏమిటా కారణాలు.?
నాడీ వ్యవస్థ సరిగ్గా ఎదగకపోవడం వల్ల తలెత్తే సమస్యే ఆటిజం. ఇది పుట్టుకతో వచ్చే సమస్యే అయినా, కొంత మంది పిల్లల్లో మూడేళ్ల దాకా గుర్తించలేకపోవచ్చు. ఆటిజం జన్యుపరమైన కారణాలతో వస్తుందని తెలిసినా, అందుకు సంబంధించిన జన్యువును ఇంతవరకూ గుర్తించలేదు. మిగతా కారణాలను పరిశీలిస్తే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా, సైటోమెగాలో వైరస్ ఇన్షెక్షన్లు వచ్చినా, మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా, రక్తస్రావ సమస్యలు , థైరాయిడ్, డయాబెటిస్ సమస్యలున్న వారి పిల్లల్లో కూడా కొందరు ఆటిజం బారిన పడే ప్రమాదం ఉంది.

పిల్లలు పుట్టిన త రువాత, కొన్ని రకాల అలర్జీలు, వ్యాక్సినేషన్లు, ఇంజెక్షన్లు, మందుల కార ణంగా కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉంది. అలాగే బాల్యంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురైన పిల్లల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. " క్లాసిక్ ఆటిస్టిక్ డిజార్డర్'' ఉన్న పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు, తామంతట తాము ఒకేపనిని పదేపదే చేసుకుంటూ ఉంటారు. 

అతి చిన్న శబ్ధాలకు, వాసనలకే వీరు విపరీతంగా స్పందిస్తారు. ఎదుగుదల, జ్ఞాపకశక్తి, తెలివితేటలు ఒక్కొక్కరికీ తేడా ఉంటుంది. అయితే 'యాస్పర్జర్ డిజార్డర్' ఉన్న పిల్లల్లో తెలివితేటలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వీరు, తదేకంగా చేసే పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 'రెట్స్ సిండ్రోమ్' అనే మరోరకం ఆటిజం ఆడపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పిల్లలు శరీరం బాగా చిక్కిపోయినట్లు ఉండి, తలిదండ్రుల మీద ఆధారపడతారు.

నివారణ ఎలా?
'ఆటిజం' ఉన్న పిల్లలకు ఆయా లక్షణాలను అనుసరించి వైద్య చికిత్సలు ప్రారంభించవలసి ఉంటుంది. మాటలు సరిగా రానివారికైతే, స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పిల్లల ప్రవర్తనలో మార్పు తేవ డంలో బిహేవియర్ థెరపీ బాగా తోడ్పడుతుంది. హోమియోపతి చికిత్సలు, పిల్లల వ్యక్తిగత లక్షణాల ఆధారంగానే కాకుండా, కుటుంబ, సామాజిక అంశాల ఆధారంగా ఉంటాయి. 

వ్యాధి తీవ్రతను అనుసరించి చికిత్సా కాలం ఆ«ధారపడి ఉంటుంది. హోమియోలో సరియైన మందుల్ని, సరైన మోతాదులో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే గరిష్ఠస్థాయి ప్రయోజనం ఉంటుంది. పైగా హోమియో చికిత్సల వల్ల దుష్ప్రభావాలు కూడా ఏమీ ఉండవు కాబట్టి, వ్యాధినుంచి కోలుకోవడమే కాకుండా, ఆ తరువాయి కాలమంతా హాయిగా కొనసాగుతుంది.

డాక్టర్ టి కిరణ్‌కుమార్, ఎం.డి.
పాజిటివ్ హోమియోపతి
ఫోన్: 9290901010

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల

Enter your email address:

0 comments:

Post a Comment