Pages

Subscribe:

Ads 468x60px

Monday, 6 August 2012

ఎండలకు కమిలిన చర్మం యధాస్థితికి తేవాలంటే

ఎండలకు కమిలిన చర్మం ఓ పట్టాన మామూలు స్థితికి రాదు. దీని కోసం మహిళలు ఎంతో కసరత్తు చేస్తుంటారు. తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తుంటారు. అలా కమిలిపోయిన చర్మాన్ని యధాస్థితికి తేవాలంటే ఎన్నో చిట్కాలు వున్నాయి. వాటిలో కొన్ని చిట్కాలు ఇక్కడ ఇస్తున్నాం.. ప్రయత్నించి చూడండి.
  • బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది.
  • నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మంచిది. ఉదయానికి ముఖం కాంతిని సంతరించు కుంటుంది.
  • బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగించాలి.
  • ప్రతి రోజూ చర్మానికి తేనెను పూతగా రాయాలి. తలవెంట్రుకలకు మాత్రం తగలకుండా జాగ్రత్త పడాలి..ఎక్కువసేపు ఉండకుండా కాస్త ఆరగానే స్నానం చేయాలి.
  • నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.
  • బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం వుంటంది. రాసిన తరువాత అర గంట వరకూ అలాగే ఉంచాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల కమిలిపోయిన చర్మం రంగు మారుతుంది.
  • పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకుని కమిలిపోయిన చర్మంపై రుద్దుతూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
  • శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు తగ్గిపోయిన ఛాయ మెరుగుపడుతుంది.
  • మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి దాన్ని రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇలా రాసుకున్న తరువాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్‌ చేయాలి.
  • గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
Enter your email address:

0 comments:

Post a Comment