Pages

Subscribe:

Ads 468x60px

Monday, 16 December 2013

ఆలోచనా ప్రక్రియను అదుపు చేయటం ఎలా?

'నేను ఆలోచనను అదుపు చేయాలనుకుంటున్నాను' అని అనుకోవడమే ఒక ఆలోచన.  "ఆలోచనా ప్రక్రియను అదుపు చేయాలనుకోవటం'2 అనే దాంట్లో మీరు పడిపోయారంటే, ఇక దానికి అంతం లేదు. అది ఒక అంతులేని పోరాటం.  

ప్రాణం(శ్వాస) నియంత్రణలో ఉంటే, మీ ఆలోచన సహజంగానే నియంత్రణలో ఉంటుంది.
ప్రాణశక్తి స్థాయి పెరిగి, నిశ్చలమైన ప్రవాహంలాగా నిలిచి, దానిపై నియంత్రణ కలిగినప్పుడు ఆలోచన అనేదే ఉండదు. గమనించటం, మామూలుగా చూడటం, ఆలోచించటం..వీటి మధ్య తేడా ఉంది. కేవలం గమనించటం కోసం ఆలోచన అవసరమే ఉండదు. గమనించటం అంటే ఒట్టి మీ భౌతిక నేత్రాలతో మాత్రమే కాదు కనులు మూసుకుని కూడా మీరు గమనించవచ్చు. అటువంటి ఎరుకను ఒకసారి మీరు పెంపొందించుకుంటే, ఇక మీరు గమనించటం చేయగలరు. ఆలోచన చేయరు.

ఆలోచనను అలా వదిలేయండి. దాన్ని గురించి మదనపడకండి. దాని దారిన దానిని పోనీయండి. మీరు కేవలం గమనిస్తూ ఉండండి. ఎరుకతో ఉండండి. అది క్రమంగా తన వేగాన్ని కోల్పోతుంది. జారిపోతుంది. అది ఒక పద్ధతి.
ప్రాణాన్ని(శ్వాసను) నియంత్రించటం మరొక పద్ధతి. మీ ఆలోచన కానీ, మీ మనసు కానీ, మీ శరీరంలోని కణజాలం కానీ, ఏదయినా కానీయండి... మీ శరీరం లోపల, మీ లోపల జరిగేది అంతా ఆఖరికి ఒక్కటే. అదే శ్వాస.
శ్వాసే దానికంతటికీ ప్రాథమికమైన ఆధారం. ఆ శ్వాసను నియంత్రిస్తే ఆలోచన అనేదీ ఉండదు. మీ శ్వాసపై మీకు తగినంత ఆధిపత్యం ఉంటే, మీ ఆలోచనపై మీకు ఆధిపత్యం వస్తుంది. మీ శరీరంపైనా, శరీరానికి గల జీవక్రియలపైనా ఆధిపత్యం వస్తుంది.

ఆకలిని అదుపు చేయాలని ప్రయత్నిస్తేనో, లేకపోతే దాహాన్ని అదుపు చేయాలని ప్రయత్నిస్తేనో కాదు, అలా చేస్తే ఆలోచనా ప్రక్రియను అదుపు చేయటం జరగదు. ప్రాణం(శ్వాస) నియంత్రణలో ఉంటే, మీ ఆలోచన సహజంగానే నియంత్రణలో ఉంటుంది. ప్రాణశక్తి స్థాయి పెరిగి, నిశ్చలమైన ప్రవాహంలాగా నిలిచి, దానిపై నియంత్రణ కలిగినప్పుడు ఆలోచన అనేదే ఉండదు.

గమనించటం, మామూలుగా చూడటం, ఆలోచించటం..వీటి మధ్య తేడా ఉంది. కేవలం గమనించటం కోసం ఆలోచన అవసరమే ఉండదు. గమనించటం అంటే ఒట్టి మీ భౌతిక నేత్రాలతో మాత్రమే కాదు కనులు మూసుకుని కూడా మీరు గమనించవచ్చు. అటువంటి ఎరుకను ఒకసారి మీరు పెంపొందించుకుంటే, ఇక మీరు గమనించటం చేయగలరు. ఆలోచన చేయరు. మీరు సంపూర్ణ ఎరుకతో ఉన్నప్పుడు ఆలోచనా ప్రక్రియ అనేదే ఉండదు. మీరు ఎరుకతో ఉన్న క్షణం, ఆలోచన అనేదే ఉండదు. ఆలోచన కలిగిన క్షణం సామాన్యంగా ఎరుక పోయిందనే అర్థం.

ఒక వ్యక్తి తన ధ్యానంలో తన ఆలోచనా ప్రక్రియను కూడా ఎరుకతో గమనిస్తాడు. కానీ సామాన్యంగా అందరూ చేయలేరు. దానికి సమన్వయం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత ప్రపంచంలో ఈ సమన్వయం లోపిస్తోంది...ఎందువల్ల? ఆధ్యాత్మికత అంటే ఒక పక్క వ్యాపకం లాగానే మనుష్యులు ఇంకా ఆలోచిస్తున్నారు. జీవితం వేరే ఎక్కడో ఉంది. ఆధ్యాత్మికత ఏదో పక్కన ఉంది. అంతే! చాలామంది వ్యక్తులు తమ జీవితాలను ఈ రకంగా నిర్మింపజేసుకున్నారు. కొన్ని చిన్న ఉత్తేజాలు చాలు. వాళ్లు ఏదో కొంత సంతోషాన్ని పొందుతారు. అంతే! అంతరంగ ప్రపంచం ఎంత అపారమైనదో మీరు చూడాలనుకుంటే, దాని అంచుల దాకా వెళ్లాలనుకుంటే అందుకు సమన్వయం కావాలి. అప్పుడే మార్గాలు తెలుసుకోవడం మొదలవుతుంది మీ కోసం!!

- సద్గురు

సేకరణ: ఆంధ్రజ్యోతి

0 comments:

Post a Comment