నల్ల ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. నల్లద్రాక్షలను రోజూ తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఇజ్రాయేల్, హైఫా రంబం మెడికల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
నల్లద్రాక్షలోని యాంటియాక్సిడెంట్లు గుండెపోటు, హృద్రోగ వ్యాధులు, సమస్యలను ఏమాత్రం దరిచేర్చవని హైఫా రంబం మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ మైఖేల్ అవిరామ్ చెప్పారు.






