Pages

Subscribe:

Ads 468x60px

Friday, 21 September 2012

సైనస్ ఇన్ఫెక్షన్‌లకు హోమియో వరం

మారిన జీవనశైలి వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గుతోంది. ఫలితంగా పలు రకాల అనారోగ్యాలు వచ్చిపడుతున్నాయి. వర్షాకాలం, చలికాలాల్లో జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, దురదలు వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అలర్జీ, సైనస్ లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. హోమియో మందులతో అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్‌లు సంపూర్ణంగా నివారించవచ్చ ంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకర్ మను.

అలర్జీ, సైనస్ సమస్యలు రోగిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
తలనొప్పి, జలుబు, కళ్లల్లో దురద, కళ్లల్లో నీళ్లు కారటం, తమ్ములు, ముక్కు మూసుకుపోవటం, గొంతునొప్పి, నోటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్, స్వరం మారటం, దగ్గు, ఆయాసం, చెవుల్లో ఇన్ఫెక్షన్‌లు వైరస్, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్, అలర్జీ లక్షణాలు. రోగి జన్యువుల తత్వాన్ని బట్టి వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్యలు ఉధృతంగా ఉండి వారంరోజుల వరకు ఉంటాయి.

బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్‌లతో ఎక్కువ కాలం అస్వస్థతకు గురయ్యే అవకాశముంది. ఇన్ఫెక్షన్‌లతో వచ్చే జలుబులో ముక్కు కారటం, జ్వరం, తుమ్ములు వస్తాయి. అలర్జీలలో జ్వరం లేకుండా ముక్కు కారటం, దురద, తుమ్ములు వస్తుంటాయి. సైనసైటిస్‌లో శ్లేష్మం చాలా చిక్కగా, జిగుటుగా ఉంటూ పదిరోజులపైనే ఇబ్బంది పెడుతుంది. సైనసైటిస్ వల్ల వచ్చే తలనొప్పి, దగ్గు తీవ్రంగా ఉంటాయి. జ్వరం కూడా రావచ్చు.

మామూలుగా ప్రాణాంతకం కాని ప్రేరేపకాలు అంటే దుమ్ము, ధూళి, పొగ వాసనలు. గడ్డిలో ఉండే సూక్ష్మక్రిములతో అవసరానికంటే ఎక్కువగా ప్రతిస్పందిచడం వల్ల ఏర్పడే లక్షణాల సముదాయమే అలర్జీగా పేర్కొంటాం. అలర్జీల్లో రోగనిరోధక కణాలు అంటే ఇస్నో ఫిలియా లాంటివి. ఈ కణాలు ప్రతిస్పందించి ప్రతిక్రియలు చేపట్టడం వల్ల దురద, తుమ్ములు, మంట, ఆయాసం మొదలవుతాయి. ఈ అలర్జీ దీర్ఘకాలికంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

సైనసైటిస్ లక్షణాలు
సైనస్ తలనొప్పి, నాసిక విభాజకం వంకర పోవటం, ముక్కులో కండ పేర్కొనిపోయి మూసుకుపోవటం, నోటి ద్వారా గాలి పీల్చుకోవటం వల్ల నోటి సంబంధిత ఇన్ఫెక్షన్‌లు, టాన్సిలైటిస్ వంటివి మొదలవుతాయి. గొంతులో శ్లేష్మం పేరుకొని పోవటం వల్ల ముక్కు పక్కటెముకలు లాగటం వంటివి ఉండవచ్చు. శ్లేష్మం పేరుకొనిపోయి రకరకాల ఇన్ఫెక్షన్‌లకు, జ్వరాలకు దారితీయవచ్చు.

రోగనిరోధక వ్యవస్థ లోపాలు
అలర్జీల్లో ఎక్కువ ప్రతిస్పందన, సైనస్ ఇన్ఫెక్షన్‌లలో తక్కువ ప్రతిస్పందన మొదలగునవి రోగ నిరోధక వ్యవస్థ ద్వారా జన్యువుల లోపాలు ప్రతిబింబింపపడుతున్నాయి. ఏ ఆరోగ్య సమస్య అయినా కారణం లేకుండా ప్రారంభం కాదు. ప్రకృతి నియమాలను పక్కన పెట్టి ఆధునికత ముసుగులో జీవించటం వల్ల వివిధ రకాల అనారోగ్యాల బారిన పడటం సాధారణంగా చూస్తున్నాం.

చిన్నతనం నుంచి కృత్రిమ ఆహారం తినటం, సుఖాలకు అలవాటు పడటం, సొంత వైద్యం చేసుకోవటం, తగిన వ్యాయామం లేకపోవడం, సహజవాయువు, గాలి, వెలుతురు సరిగా లేకపోవటం, కాలుష్యం పెరగటం, మానసిక ఉల్లాసం తగ్గి ఒత్తిడి పెరగటం వంటివి రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే జన్యువుల్లో అసహజ మార్పులను ఉత్పత్తి చేయడం తద్వారా జీవరసాయన సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.

సంక్లిష్ఠతకు దారితీసే వ్యాధులు
అలర్జీ, సైనస్ మాదిరి లక్షణాలకు సరైన వైద్యం అందించకుంటే వివిధ రకాల సంక్లిష్టతలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక లక్షణాల వల్ల నిద్రలేమి,కళ్లకింద నల్లని చారలు ఏర్పడటం, పిగ్మెంటేషన్ సమస్యలు, నాసిక విభాజకం వంకర పోవటం, ముక్కులో కండ పేరుకొని పోవటం, సైనస్ తలనొప్పి, వాసన గ్రహించలేక పోవటం, చెవి ఇన్ఫెక్షన్‌లు, స్వరం మారటం, ఏకాగ్రత లోపాలు, జ్ఞాపకశక్తి లోపాలు, బరువు తగ్గటం వంటివి జరగవచ్చు.

అలర్జీల వల్ల బ్రాంకైటిస్ సమస్యలు, చర్మం, ఆర్థరైటిస్, హార్మోన్, లివర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్‌ల వల్ల ఆస్తమా, గుండె, రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి శక్తి నిల్వలు శరీరం కోల్పోయి నిరాశ, నిస్ప్రహ, ఒత్తిడితో వివిధ రకాల ఇన్ఫెక్షన్‌ల బారినపడే ప్రమాదముంది. రోగ లక్షణాలను బట్టి ఈఎస్ఆర్, సీబీపీ, ఐజీఎం, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ పరీక్షలతో అలర్జీలను నిర్ధారణ చేయవచ్చు. అందరిలో ఒకేరకమైన పరీక్ష ఫలితాలు, లక్షణాలు ఉండవు.

జాగ్రత్తలు
ప్రేరేపకాలకు దూరం కావటం వల్ల అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్‌లను నిరోధించలేం. సమస్యను అవగాహన చేసుకొని సరైన వైద్యం చేయించుకోవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్య లక్షణాలు తగ్గుముఖం పట్టగానే చికిత్సను వైద్యుని సలహా లేకుండా ఆపటం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ, జన్యువుల లోపాలు సరిదిద్దడంతోనే పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉదయం పూట సూర్యరశ్మిలో కొంత సమయం గడపటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, సమయానుసారం భోజనం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించటం వంటివి చికిత్సలో ముఖ్య భాగమే.

శరీరం తెలియచేసే మానసిక, శారీరక రోగ లక్షణాలను అవగాహన చేసుకోవటం, అనారోగ్యంలో శరీరంలో జరిగే మానసిక, శారీరక మార్పులను తెలుసుకోవటం మనిషి జన్యుతత్వాన్ని బట్టి మారే ప్రేరేపక అంశాలు. లక్షణాలను బట్టి సరైన హోమియో మందుల ద్వారా పూర్తి పరిష్కారం అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్‌లకు లభిస్తుంది. వంశపారంపర్యం, పునరావృ త్తాలను కూడా నియంత్రించవచ్చును. మద్యలో జరిగే శారీరక, మానసిక మార్పులను కూడా హోమియో వైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం వల్ల చికిత్స సమయం తగ్గించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను హోమియో మందులతో పటిష్ఠ పర్చడం ద్వారా మారుతున్న కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్‌లను నియంత్రించవచ్చు.

డా. శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా. మనూస్ హోమియోపతి,
ఫోన్ : 9032 108 108
9030 339 999
మూలం : ఆంధ్రజ్యోతి, సకల
Enter your email address:

0 comments:

Post a Comment