Pages

Subscribe:

Ads 468x60px

Friday, 9 August 2013

ఆలోచనలు అదుపులో ఉంటే నో డిప్రెషన్‌

మనం ఒత్తిడికి గురైనపుడు నిరాశానిస్ప ృహలు ఆవరించి డిప్రెషన్‌లో పడతాము. శరీరం ముందుగా ఆ సంకేతాలను అందుకొంటుంది. చిరాకుగా, మూడీగా ఉన్నవారు అది పోగొట్టుకోడానికి 10 సూచనలు పాటిస్తే సరి. ఒత్తిడి వలన చిరాకు, కోపం, ఏదో ధోరణిలో ఉండడం వంటి లక్షణాలు కలుగుతాయి. ఏదీ చేేయలేం. దేనిమీదా దృష్టిపెట్టలేం. త్వరగా దీనినుంచి బైటపడితేగాని మళ్లీ మన రోజువారీ పనులు మామూలుగా చేసుకోలేము.
సాధారణంగా డిప్రెషన్‌ వలన భాధపడుతున్న 65 శాతం ఆడవారిలో నిజంగా పరిస్థితి అంత ఘోరంగా ఉండదని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. వారిలో మధ్యాహ్నంతరువాత ఏదోతెలియని ఆందోళన, మగత లక్షణాలు కనిపిస్తాయి. అతిగా తినడం కూడా ఈ లక్షణాలలో ఒకటి. వాషింగ్టన్‌ యూనివర్శిటీ పరిశోధకులు అనేదేమంటే, ఈ లక్షణాలలో రెండు లేదా ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వారి శరీరం ఒత్తిడి సంకేతాలను పంపుతోందని గ్రహించాలి. అందుచేత డిప్రెషన్‌ ఆవరించకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

విటమిన్‌డి తో డిప్రెషన్‌ మాయం
విటమిన్‌ సన్‌షైన్‌ అనిపేరున్న విటమిన్‌ డి మెదడులో యాంటి డిప్రసెంట్‌ హార్మోన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. పెరొటోనిన్‌, ఆక్సిటోసిన్‌ వంటి పేర్లుగల యాంటి డిప్రసెంట్‌ హార్మోన్లను మెదడు ఉత్పత్తి చేస్తుంది. వాటి ద్వారా కనీసం 30 శాతం మీ మూడ్‌బాగవుతుంది. ఉదయం పూట విటమిన్‌ డి బాగా చురుగ్గా పనిచేస్తుంది. పోషకాలు శరీరానికి బాగా అంది, డిప్రెషన్‌ తగ్గే అవకాశం ఉదయం పూట బాగా ఉంటుందని టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. విటమిన్‌ డి శరీరం నుంచి విడుదలయ్యేలా మీరు ఉదయం కాస్సేపు ఎండలో నిలబడడం వంటివి చేయాలి.

వెలుతురు చాలా అవసరం
మీకు అలవాటైన జీవ గడియారం మీ కళ్లకు అనుసంధానమై ఉంటుంది. అందుకే పగలు మీ ఇల్లు, పని
పరిసరాలను ఆనందదాయకంగా, కాంతివంతంగా ఉంచుకోవాలి. ఎక్కువ ఓల్టేజ్‌ ఉన్న బల్బులనే వాడాలి. కర్టెన్లను తెరిచి ఉంచాలి. నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు వెలుగు ప్రసరించే కంప్యూటర్‌ వంటివి స్విచాఫ్‌ చేయాలి. మీ పరిసరాల శుభ్రత పట్ల మీరు అంతగా తపన చూపించనక్కరలేదు. మీ పరిశుభ్రత ప్రమాణాలను తగ్గిస్తే, ఎక్కువసేపు మీరు కులాసాగా ఉంటారు, విశ్రాంతిలో గడుపుతారు. ఫలితంగా కార్టోసిల్‌ ఉత్సత్తి తగ్గడానికి దారి తీస్తుంది. ఇది స్ట్రెస్‌ హార్మోన్‌ . అది మెదడు పనితీరును దెబ్బతీసి మీలో యాంటి డిప్రసెంట్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని నీరసింపజేస్తుంది. తక్కువ శుభ్రత వలన మీ సెరొటోనిన్‌ ఉత్పత్తి వారంలోనే పెరుగుతుంది. అందుచేత డిప్రెషన్‌ నియంత్రణ సాధ్యమవుతుంది.

సంతోషం కోసం డాన్స్‌
వ్యాయామంతో పాటు లయ ప్రకారం సాగే కదలికలే నృత్యం అంటే. మూడ్‌ను నిలకడగా ఉంచే హార్మోన్ల ఉత్పత్తిలో ఆ రకం కదలికలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఫలితాలు బాగుండాలంటే రోజూ కనీసం 30 నిమిషాలపాటు నాట్యం చేయాలి. ఇలా తొమ్మిది వారాలు నాట్యంచేసిన ఓ వ్యక్తికి డిప్రెషన్‌ 67 శాతం తగ్గినట్లు ఓ స్వీడిష్‌ నివేదిక వెల్లడించింది. యాంటి డిప్రెసెంట్‌ మందుల ద్వారా కూడ ఇంత పురోగతి సాధ్యంకాదు.

పాటలతో మంచి ఫలితం
నాట్యం చేస్తున్నపుడు నేపథ్యంలోని ఆ గీతాన్ని కూడా పాడడానికి ప్రయత్నించడం మంచిది. మెదడులో ప్రశాంతతకు కావలసిన ఆల్ఫా తరంగాలను పాట ఉత్పత్తి చేసి మూడ్‌ను బాగుచేస్తుంది. తమకు ఇష్టమైన పాటలతో గొంతుకలిపి , రోజూ 15 నుంచి 20 నిమిషాలసేపు పాడే మహిళలు కష్టాలనుంచి వేగంగా కోలుకొంటారని, తిరిగి ఆ తప్పులను చేయరని కూడా స్వీడిష్‌ నివేదిక స్పష్టం చేసింది.

ఆహారంలో పిండి అవసరం
మెదడులోని యాంటి డిప్రెసెంట్‌ హార్మోన్‌ సెరొటోనిన్‌కు కీలకమైన టిప్టోఫాన్‌ను 54శాతం ఉద్దీపింప చేయడానికి బంగాళ దుంపలు పేరుబడ్డాయి. మీ నడుముపై వాటి ప్రభావం గురించి మీరు ఆందోళన చెందితే పాప్‌ కార్న్‌ వంటి పిండి ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండేదానిని తినండి.

అవకాడోలు తినండి
అవకాడోలను తినడం డిప్రెషన్‌ తగ్గడానికి మంచిదే నంటున్నారు పరిశోధకులు. రోజూ సగానికి కోసిన అవకాడోను తింటే డిప్రెషన్‌ దరి చేరదని పరిశోధనల్లో తేలింది. ఇది అంతగా దొరికే కాయకాదు. ముంబై తరచూ వెళ్లేవారు బంద్రాలోని పాలీ మార్కెట్‌లో దీనిని కొనవచ్చు. అలాగే క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఇది తింటే డిప్రెషన్‌ లక్షణాలు 25 శాతం మాయమౌతాయి. డోపామైన్‌ అనే హార్మోన్‌ను ప్రేరేపించడం ద్వారా మెదడును అది చురుకుగా ఉంచుతుంది.

చురుకైన క్లబ్‌లో చేరితే..
పదిమంది జనం ఒకచోట కూడడం చాలా మంచిది. మహిళలు యోగా క్లబ్‌ లేదా మార్నింగ్‌ వాక్‌ క్లబ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. వారానికి ఒక రోజైనా ఇలా గ్రూపుగా గడపడం డిప్రెషన్‌ను దూరంగా పెట్టే ఉపాయమేనంటున్నారు సర్వే వారు. ఇలా చేస్తే నెల్లాళ్లలో ఉరకలేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా తయారవుతారని వారి హామీ. క్రమం తప్పకుండా మసాజ్‌ చేయించుకొంటే మెదడులో తరంగాల ఉరవడి క్రమబద్ధమౌతుందని నిపుణులు హామీ నిస్తున్నారు. విరుద్ధ ఆలోచనలను మసాజ్‌ కట్టడి చేస్తుంది.

మెదడులో సానుకూల భావాలను పుట్టించడానికి వారానికి 20 నివిషాల మసాజ్‌ చాలు. ప్రొద్దుటే నిద్రలేచేవారితో పోలిస్తే రాత్రి మేలుకొని ఉండేవారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే మీరు నిద్రపోయే వేళలను వీలుగా మార్చుకోవాలి. నడి రాత్రి దాకా మేలుకొని ఉండి, ప్రొద్దుట సూర్య కాంతిని కోల్పోయేలాగా ఆలస్యంగా నిద్ర లేచేవారు విటమిన్‌ డి చేసే మంచిని కోల్పోతారు. ఈ దిగువ లక్షణాలుంటే వైద్యసలహా అవసరం.
  • ఎప్పుడూ రాని నోప్పులు, అలసట, శారీరక బాధలుంటే..
  • హఠాత్తుగా స్వీట్లు తినాలని బలంగా అనిపిస్తే..
  • మధ్యాహ్నం తరువాత ఇంకా ఇంకా తినాలని అనిపిస్తే.. మిరపకాయ బజ్జీ వంటి వీధిపక్క ఆహార పదార్ధాలు అతిగా తినాలనిపిస్తే..
  • తరచూ చిరాకు, కోపం వస్తుంటే..
  • శరీరానికీ, మెదడుకూ మధ్య సమన్వయ ప్రక్రియ దెబ్బతినకుండా చూడడం డిప్రెషన్‌ బారిన పడకుండా తీసుకొనే అసలైన జాగ్రత్త. 
సేకరణ: ప్రజాశక్తి, జీవన

0 comments:

Post a Comment