ఊబకాయం ఉసురు తీస్తోంది. అవును అనేక వ్యాధులకు ఊబకాయం కారణమని పరిశోధనల్లో నిర్ధారణ అయింది. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు..ఇలా ఒక్కటేమిటి అన్ని జబ్బులకు ఊబకాయమే కారణం. అయితే చాలా మంది ఊబకాయం వస్తున్నా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొందరు బరువు తగ్గుదామని ప్రయత్నించి విఫలం అవుతారు. మరికొందరు నాన్‌సర్జికల్ ట్రీట్‌మెంట్లని, మందులతో బరువు తగ్గుదామని ప్రయత్నించి ఇతర సమస్యలను కొనితెచ్చుకుంటారు.
నిజానికి ఊబకాయాన్ని తరిమేయడానికి బేరియాట్రిక్ సర్జరీ చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు డాక్టర్ టి.ఎల్.వి.డి ప్రసాద్‌బాబు.
ఊబకాయం ఉన్న వారికి బరువు తగ్గించడానికి చేసే సర్జరీనే బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఇందులో జీర్ణవ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా బరువు తగ్గేలా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ క్యాలరీలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల క్రమేణా బరువు తగ్గుతూ వస్తారు. సడన్‌గా బరువు తగ్గడం ఉండదు. ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు.
బరువు వెన్నంటే వ్యాధులు
సాధారణ బరువు ఉన్న వారితో పోల్చితే అధిక బరువు ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఊపిరితీసుకోవడంలో సమస్య(స్లీప్ఆప్నియా) వంటివి వచ్చే అవకాశం ఉంది. ఒబేసిటీ మూలంగా డిప్రెషన్ పెరిగిపోతుంది. ఫలితంగా వృత్తిలో రాణించలేకపోతారు. శరీరాకృతి దెబ్బతినడం వల్ల నలుగురిలో తిరగలేకపోతారు. కాలేయంలో కొవ్వు చేరడం(ఫ్యాటీలివర్), కిడ్నీలు దెబ్బతినడం జరుగుతుంది. జాయింట్లు దెబ్బతింటాయి. నడుము నొప్పి బాధిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్థూలకాయం యొక్క ప్రభావం ప్రతీ అవయవంపైన పడుతుంది. అందుకే దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు.
ఇతర చికిత్సలతో ఫలితం శూన్యం
నాన్ సర్జికల్ ట్రీట్‌మెంట్‌లో కొవ్వును మాత్రమే తొలగిస్తారు. అంతేతప్ప కొవ్వు చేరడానికి కారణమవుతున్న రూట్‌కాస్‌ని తొలగించే ప్రయత్నం చేయరు. దీనివల్ల కొవ్వు తొలగించిన కొన్ని రోజుల్లోనే మళ్లీ బరువు పెరగడం జరుగుతుంది. అదే బేరియాట్రిక్ సర్జరీలో రూట్‌కాస్‌ని తొలగించడం వల్ల మళ్లీ బరువు పెరగడం జరగదు.
ఎవరికి అవసరం?
బీఎమ్ఐ 37.5 కన్నా ఎక్కువ ఉన్న వారు ఈ సర్జరీ చేయించుకోవచ్చు. 18 ఏళ్లు పైబడి, 65 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకోవచ్చు. సర్జరీకి ముందుగా పేషెంట్‌ని ప్రిపేర్ చేయాలి. అంటే ఆహారనియమాలు పాటించడం ద్వారా కొంత బరువు తగ్గేలా చేయడం, చికిత్సపై అవగాహన కల్పించడం, పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ప్రిపేర్ అయ్యేలా చేయడం ద్వారా కాంప్లికేషన్స్‌ను తగ్గించవచ్చు. అంతేకాకుండా ఆపరేషన్ చేయడానికి మంచి పరికరాలు, ఆధునిక సదుపాయాలున్న ఆసుపత్రి ఉండాలి. వైద్యులు ఒక టీమ్‌గా ఏర్పడి సర్జరీ చేయాల్సి ఉంటుంది.
బరువు పెరగడానికి కారణం ఏమిటి?
ఆహారపు అలవాట్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవడం, కొవ్వులు, పంచదార వినియోగం ఎక్కువగా ఉండటం వంటివి కారణమవుతున్నాయి. దీనికితోడు శారీరక శ్రమ పూర్తిగా కొరవడటం స్థూలకాయాన్ని తెచ్చిపెడుతోంది. నిజానికి ఒకరి బరువు పెరగడానికి నిర్ధిష్టంగా కారణాలు తెలియవనే చెప్పవచ్చు. అయితే వంశపారంపర్యంగా వచ్చే శరీరతత్వం, ప్రవర్తన, మానసికమైన అంశాలు వంటివి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. బరువు పెరగడానికి జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతాయి.
శాశ్వత పరిష్కారం
స్థూలకాయంతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కొవ్వును తీసే ఆపరేషన్ కాదు. జీర్ణాశయం పరిమాణంను తగ్గించడం జరుగుతుంది. ఫలితంగా తీసుకునే ఆహార పరిమాణం తగ్గిపోతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. అధిక బరువుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పైగా ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ప్రస్తుతం బరువును తగ్గించడానికి చేసే సర్జరీలలో గ్లాస్ట్రిక్ స్లీవ్ ముఖ్యమైనది. ఈ సర్జరీ తరువాత తక్కువ ఆహారంతో కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సర్జరీని ప్రస్తుతం కీహోల్(లాప్రోస్కోపిక్) విధానంలో చేస్తున్నారు. ఈ విధానం వల్ల త్వరగా కోలుకుంటారు. చాలా సురక్షితమైన విధానమిది. రిస్క్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మంపై ఎటువంటి గాట్లు, మరకలు ఉండవు.
లాభాలు అనేకం
స్థూలకాయులై ఉండి డయాబెటిస్ ఉన్నట్లయితే సర్జరీ తరువాత 60 నుంచి 70 శాతం మందిలో డయాబెటిస్ తగ్గిపోయే అవకాశాలుంటాయి. అధిక రక్తపోటు ఉన్నా కంట్రోల్ అవుతుంది. స్లీప్ ఆప్నియా సమస్య తొలగిపోతుంది. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గిపోతాయి. స్త్రీలలో పీసీఓడి, రుతు సమస్యలు ఉండే తొలగిపోతాయి. సంతానలేమి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యుని పర్యవేక్షణలో ఆధునిక సదుపాయాలున్న ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటే మెరుగైన ఫలితాలు సొంతమవుతాయి. సర్జరీ తరువాత కూడా డాక్టర్ ఫాలోఅప్‌లో ఉన్నప్పుడే మంచి ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి.
డా. టి.ఎల్.వి.డి. ప్రసాద్‌బాబు
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్
హైదరాబాద్
ఫోన్ : 9603613171
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment