మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్, ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.
Showing posts with label belladona. Show all posts
Showing posts with label belladona. Show all posts
Wednesday, 19 September 2012
Subscribe to:
Posts (Atom)






