సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్ తప్పని సరి మరి. అది లేందే పూట గడవని పరిస్థితి. గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఈ రేడి యేషన్ దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు.
Showing posts with label cancer. Show all posts
Showing posts with label cancer. Show all posts
Saturday, 28 December 2013
Friday, 12 October 2012
అల్సరా...? కేన్సరా...?
కడుపులో మంట అనగానే అల్సర్ అని చాలా మంది అనుకుంటారు. ఏవో తెలిసిన నాలుగు మాత్రలు వేసేసుకుంటారు. కానీ అది కేన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుని చికిత్స అందించినా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఏ కాస్త ఆకలి తగ్గినా, అరుగుదల తగ్గినా, మంటగా ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. టి.ఎల్.వి.డి ప్రసాద్‌బాబు.
Labels:
bone-cancer,
cancer,
ulcer,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు
Thursday, 27 September 2012
ముందే గుర్తిస్తే బోన్ కేన్సర్‌తో ముప్పే లేదు
బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. అందుకే ఈ కేన్సర్లను ఎంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత ప్రయోజనం అంటున్నారు డాక్టర్ సిహెచ్ మోహన వంశీ.
Labels:
bone-cancer,
cancer,
primary-bone-cancer,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు
Saturday, 4 August 2012
ఒవేరియన్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే పాలకూరను తీసుకోండి
పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారిలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి.
ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ కూరలో క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ తదితరాలుంటాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది.
Labels:
cancer,
leafy-vegitables,
overian-cancer,
ఆకుకూరలు,
ఆయుర్వేదం
Subscribe to:
Posts (Atom)









