Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label yoga. Show all posts
Showing posts with label yoga. Show all posts

Saturday, 28 December 2013

యోగా: ఒత్తిడి నివారణకు

ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవుతాయి. ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే సరిపోతుంది. ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు. 

వజ్రాసనం : 
రెండు కాళ్లూ ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు ఒక్కోకాలు వెనక్కి తీసుకెళ్లి జఘన భాగం కిందుగా ఉంచాలి. రెండు పాదాల

Thursday, 18 October 2012

యోగాతో మానసిక ఉల్లాసం

ప్రస్తుతం ప్రపంచమంతా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచాన్నే తమ గుప్పిట్లో ఉంచుకున్న నేటి ప్రజలు ప్రస్తుతం యోగా అంత అవసరమా అని అంటుంటారు కొందరు.

భౌతిక సుఖ జీవనానికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖ జీవనానికి యోగా ఉందంటున్నారు యోగా గురువులు.

యోగా చేసేముందు తెలుసుకోవలిసిన విషయాలు

యోగ సాధన చేయాలనుకునే విద్యార్ధులు ముందుగా యోగా నిపుణుల చేత సరైన తర్ఫీదును, సూచలను తీసుకోవాలి.

అదే సమయంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి. తొలిసారి యోగసాధన ప్రారంభించేవారు తప్పక వైద్యుడి అనుమతి తీసుకోవాలి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు కొన్ని రకాల వ్యాయామాలను చేయకూడదన్నదే దీని వెనక ఉన్న ఉద్ధేశ్యం. కాబట్టి ప్రారంభంలోనే వైద్యపరీక్షల్లో పాల్గొనడం అత్యంత ముఖ్యాంశం.

బిపి ఉన్నవాళ్లు చేయవలసిన వ్యాయామాలు

బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ (బీపీ). దీనినే హైపర్ టెన్షన్ అనికూడా అంటారు. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు. ఇవి చేసేటప్పుడు ఆయాసం రాకుండా చూసుకోవడం ఎంతో ఉత్తమం. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు. 

Friday, 21 September 2012

యోగాతో మనోనిగ్రహం...

మనం ఊహించుకునే వస్తువు సన్మార్గం వైపునకు మళ్లించేదిగా ఉండాలి. అప్పుడు కాన్‌సన్‌ట్రేషన్ ద్వారా నిశ్చలమైన ఆలోచనలు కలుగుతాయి. కాన్‌సన్‌ట్రేషన్... సాధన ద్వారా సిద్ధిస్తుంది. దీనికి ఉపయోగపడే అంశాలు అగోచరంగా ఉంటాయి. అంటే కంటికి కనిపించవు. 

ధ్యానం చేయడానికి శరీరం, మనసు రెండూ సహకరించాలి. ముందుగా శరీరాన్ని భౌతికంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలా ఉండాలంటే... వ్యాయాయం తప్పనిసరి. నిత్య వ్యాయామం వల్ల శరీర అవయవాలు, నాడులు, ఎముకలు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి.

Thursday, 23 August 2012

అధిక బరువును తగ్గించుకోడానికి రోజూ యోగ చేయాలి

అధిక బరువు, ఒత్తిడితో భాదపడేవారికి యోగా బాగా సహాయపడుతుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతత కలిగించేది యోగా ఒక్కటే. వ్యాయామం కంటే యోగా ఎన్నో రెట్లు మంచిది.
  • అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి యోగా చాలా మంచిది. ప్రతిరోజు యోగా చేస్తే క్యాలరీలు వేగంగా తగ్గుతాయి. ఎరోబిక్ ఎక్సర్‌సైజులు చేసిన దానితో సమానం. ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి రకరకాల యోగా భంగిమలు సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.